ఒకేఒక్క షో 100 కోట్లు కలెక్ట్ చేసింది..!

Friday, January 15th, 2016, 08:00:34 PM IST


తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్బంగా ఒక వైపు పెద్ద హీరోల సినిమాల సందడి.. మరోవైపు ఇదే మరో వైపు కోడి పందేల సందడి పోటా పోటీగా మొదలైంది. సినిమాల సందడి అన్ని జిల్లాల్లో ఉంటే ఈ కోడి పందేలు మాత్రం కృష్ణా.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ రిలీజైన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఒక్క రోజులో 100 కోట్లు కలెక్ట్ చేయలేదు. కానీ కోడి పందేల్లో మాత్రం ఈ సంక్రాంతి ఒక్కరోజే 100 కోట్లు చేతులు మారాయి.

పందెం రాయుళ్ళు ప్రభుత్వాలు వద్దంటూ ఉత్తర్వులు ఇచ్చినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అంగరంగ వైభవంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాటు జరిగాయి. ఎల్ఈడీ టీవీలు, ఫ్లెడ్ లైట్లు, డ్రోన్లు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. దీంతో సినిమాల కలెక్షన్ల కన్నా ఈరోజు నాన్ స్టాప్ గా సాగుతున్న కోడి పందేల సింగిల్ షోలో ఇప్పటికే 100 కోట్ల మేర కలెక్ట్ అయిందన్నమాట.