మోదీ మళ్ళీ ఏపీలో కాలు పెట్టగలడా..?

Friday, May 6th, 2016, 01:56:42 PM IST


నరేంద్ర మోదీ.. భారత ప్రజల ప్రియతమ ప్రధాని. ముఖ్యంగా దేశ యువత అయితే ఈయన్ను ఆదర్శంగా తీసుకోవడంలో ముందుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఈయనపై మంచి నమ్మకంతో ఉన్నారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అని, కాంగ్రెస్ ఏపీని ముక్కలు చేసిందని అన్న మోదీ ఇప్పుడు ఏకంగా ఉన్న ఆ కాస్త ప్రాణం కూడా తీసేస్తోంది.

మునుపు మోదీ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా పర్యటనకు వస్తున్నారు అంటే చాలు అందరి చూపులు ఆటే ఉండేవి. మోదీ వచ్చాడు. ఏం మాట్లాడతాడు. మనకు ఎలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తాడు అనుకుంటూ అందరూ ఆటే పరిగెత్తే వాళ్ళు. కానీ ఇప్పుడు మోదీ చేయబోతున్న ద్రోహానికి ప్రజలు ఉడికిపోతున్నారు. హోదా రాదంటే రాదనే చెప్పాలి. కనీ ఎన్నికల సమయంలో రాదు, లేదు అన్న మాటే వినబడలేదు. మరిప్పుడు అవి తప్ప ఏమీ వినపడటం లేదు. దీంతో మోదీపై ప్రజలు దాదాపు నమ్మకాన్ని కోల్పోయారు. ఇకపై నమ్మకం లేని చోట మోదీ కాలు ఎలా పెడతారో, ఇంకా ఎలాంటి స్వప్రయోజనం కోసం పెడతారో చూడాలి.