తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ వేగవంతం

Tuesday, March 29th, 2016, 06:09:28 PM IST


ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ వేగవంతమైంది. ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర న్యాయ శాఖ, హోమ్ శాఖ, శాసన సభ కార్యదర్శులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ స్థానాల పెంపుతో భవిష్యత్తులో ఎటువంటి న్యాయ, చట్టపరమైన సమస్యలు రాకుండా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఈ విభజన చట్టం ప్రకారం ఏపీలో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలను 225 కు పెంచే అవకాశముంది. అలాగే తెలంగాణలో ఉన్న 113 స్థానాలను 153కు పెంచనున్నారు. దీనికి సంబందించిన బిల్లు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే కేంద్రం కూడా 2019 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ అంశాన్ని పూర్తి చేయ్యాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ప్రజా ప్రయోజనం మాటేమోగాని అధికారపార్టీలు మాత్రం పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు, కొత్తగా వచ్చి చేరుతున్న నేతలను సంతృప్తి పరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.