మ్యాచ్ పొట్టిదే.. కానీ లక్ష్యం పొడవైంది

Tuesday, January 26th, 2016, 02:28:59 PM IST


ఆస్ట్రేలియా – భారత్ మధ్య మొదటి టీ-20 ప్రారంభమైంది. అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి యువరాజ్, నెహ్రా రీ – ఎంట్రీ ఇవనున్నారు. త్వరలో సవదేశమ్లొ జరగబోయే టీ -20 వరల్డ్ కప్ కు ఈ మ్యాచ్ లు రిహారల్స్ గా నిలవనున్నాయి. వరల్డ్ కప్ తుది జట్టు ఎంపిక కోసం కూడా ఈ మ్యాచ్ లు కీలకం కానున్నాయి.

వన్డే సిరీస్ గెలిచి ఊపు మీదున్న ఆస్ట్రేలియా టీ -20 సిరీస్ కూడా గెలుచుకోవాలని చూస్తుంటే.. చివరి
వన్డే గెలిచి కాస్త కోలుకున్న టీమిండియా టీ -20 సిరీసైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ (23), ధావన్ (4) పరుగులతో భారత స్కోరు 3 ఓవర్లు ముగిసేసరికి 30/0 గా ఉంది.