465 పరుగులకు టీంఇండియా ఆలౌట్!

Monday, December 29th, 2014, 08:19:50 AM IST


భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీంఇండియా 465 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక దీనితో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్ స్కోరు కంటే భారత్ 65 పరుగులు వెనకబడింది. కాగా బాక్సింగ్ డే టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టుకు దీటిగా సమాధానం ఇస్తుంది అనుకున్న టీం ఇండియా నాలుగు రోజు ఆటలో ఆఖరి రెండు వికెట్లను ఆసిస్ బౌలర్లు కూల్చేయడంతో 465 పరుగులతో ఆటను ముగించింది. అయితే అజింక్య రహానే, విరాట్ కోహ్లి సంచరీలు సాధించడంతో టీం ఇండియా ఈ మాత్రం స్కోరును అయినా సంపాదించగలిగింది.

ఇక వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 57 పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. కాగా లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ ను కోల్పోయి 90 పరుగులు చేసింది. దీనితో ఆసిస్ ఇప్పటికి 150 పరుగుల లీడ్ ను సాధించినట్లైంది.