రోహిత్ నిలబట్టినా.. బౌలర్లు కూలదోశారు

Friday, January 15th, 2016, 05:02:13 PM IST


రోహిత్ శతకం బాదాడు.. రహనే, కోహ్లీ చెలరేగారు.. అయినా భారత్ మ్యాచ్ ఓడిపోయింది. భారత్ – ఆస్త్రేలియాల మధ్య జరిగిన రెండో వన్డేలో మొదటి మ్యాచ్ లో ఎలా ఓడిపోయిందో అలానే ఓడిపోయింది భారత్. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే శిఖర్ ధావన్ ఔటైనా రోహిత్ చెలరేగిపోయి 127 బంతుల్లో 124 పరుగులు చేసి సిరీస్ లో రెండో సెంచరీని సాదించాడు. అతనికి తోడుగా కోహ్లీ 67 బంతుల్లో 59 పరుగులతో కాసేపు, రహానే 80 బంతుల్లో 89 పరుగులతో కాసేపు చెలరేగ్గా భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.

బ్యాట్స్ మెన్లు భారీ లక్ష్యాన్ని నిర్దేసించినప్పటికీ అంతా అనుకున్నట్టే బౌలర్లు ఈసారి కూడా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో ఆరోన్ ఫించ్ 81 బంతుల్లో 71, షాన్ మార్ష్ 84 బంతుల్లో 71, బెయిలీ 58 బంతుల్లో 76, స్మిత్ 47 బంతుల్లో 46 పరుగులతో చెలరేగి 7 వికెట్ల తేడాతో విజయం సాదించారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జడేజా తలా ఒక వికెట్ మాత్రమే తీసుకున్నారు. బ్యాట్స్ మెన్లు ఎంత గొప్పగా రాణించినా బౌలర్లు పటిష్టమైన బౌలింగ్ చేయకపోవటంతో భారత్ రెండోసారి కూడా ఓటమిపాలైంది.