రాష్ట్రపతి కుమారుడు హీరో అయ్యాడు

Monday, November 23rd, 2015, 05:08:58 PM IST

pranab-son
మన చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళలో చాలా మంది తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తీరికే లేనట్లు ప్రవర్తిస్తుంటారు. ఛోటా నేతల కొడుకుల దగ్గర్నుంచి బడా నేతల కొడుకుల వరకూ అందరూ ఒకే ఫోజు కొడుతూ తిరుగుతుంటారు. వాస్తవానికి వాళ్లకి అంత తీరిక లేక కాదు గోప్పవాళ్ళమన్న బెట్టు అంతే. కానీ దేశంలో ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అబిజిత్ ముఖర్జీ మాత్రం అటువంటి ఆహాలకు పోకుండా ఆపదలో ఉన్న ఓ మహిళ పట్ల భాద్యత గల సామాన్య పౌరుడిలా స్పందించి హీరో అనిపించుకున్నాడు.

సుమితాపాల్ అనే మహిళ ఆదివారం తన కుమారుడు ఆర్ఘ్య తో కలిసి మోటార్ సైకిల్ పై బురుద్వాన్ నుండి గస్కరాలోని ఓ గుడికి వెళుతుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన చోటు నిర్మానుష్య ప్రాంతం గనుక సహాయం అడిగేందుకు ఎవరూ కనిపించకపోవటం తో ఆమె దీనస్థితిలో పడిపోయింది. ఇంతలో అదే మార్గంలో వెళుతున్న అబిజిత్ ముఖర్జీ ఆమెను చూసి తన కారులో ఆమెను గస్కరా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను బురద్వాన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళమని చెప్పగా అబిజిత్ ముఖర్జీనే దగ్గరుండి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అంతేగాక కలెక్టర్ కి కూడా విషయం చెప్పి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చేశారు. వైద్యానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కూడా ఆయనే భరించారు. రాష్ట్రపతి కొడుకునన్న అహంకారం ఏమాత్రం లేకుండా సామాన్య పౌరుడిలా భాధ్యతగా పని చేసిన అబిజిత్ ముఖర్జియా ఇప్పుడు అందరి దృష్టిలో ఓ హీరో అయ్యాడు. అబిజిత్ ముఖర్జీ ప్రస్తుతం ముర్షితాబాద్ లోని జంగీపూర్ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.