పర్యాటక రంగంలో భారత్ ర్యాంక్ మెరుగుపడుతుందా?

Monday, December 8th, 2014, 06:36:56 PM IST


ప్రపంచం పర్యాటక రంగంలో భారత్ ఏ స్థానంలో ఉన్నది… భారత్ ర్యాంక్ ఎంత.. తెలుసుకోవాలనే ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ ఉన్నది. ఎందుకంటే…మనదేశానికి పర్యాటక రంగం పరంగా ఎక్కువగా ఆకట్టుకునే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వరదలు సంభవించాయి. ఈ వరదలు సంభవించడంతో… జమ్మూకాశ్మీర్ లో పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. కాశ్మీరులకు పర్యాటక రంగంద్వారానే ఎక్కువ ఉపాది కలుగుతుంది. ఇక దక్షిణ భారతం నుంచి చూసుకుంటే… హుధూద్ తుఫాను ధాటికి అరకు అందాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో దక్షిణాదిన పర్యాటక రంగం సైతం దెబ్బతిన్నది. ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఉగ్రవాదులు దాడులు కాశ్మీర్ ను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారంటే… అది మోడీ ఇచ్చిన హామీలే కారణం కావొచ్చు. తిరిగి కాశ్మీర్ తన అందాలను సంతరించుకుంటుందనే ఆశ అయినా కావొచ్చు.

ఇక ప్రపంచంలో భారత్ పర్యాటక రంగంలో 65స్థానంలో ఉన్నది. ఈ వివరాలను టిటిసిఐ తెలియజేసింది. ఈ టిటిసిఐ నివేదిక ప్రకారం 140దేశాలలో భారత్ ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. అయితే ఆసియాలో భారత్ 11 వ స్థానంలో నిలిచింది. ఈ వచ్చే ఏడాది నాటికి ప్రస్తుతం 65గా ఉన్న ర్యాంకును 63కు తగ్గించేందుకు కృషి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ తెలియజేశారు.