సాగర్ ఉప ఎన్నికలో ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు.. కారణం అదే..!

Thursday, April 15th, 2021, 08:35:31 AM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటర్లకు ఎడమచేతి మధ్య వేలికి ఇంకు గుర్తు పెట్టనున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడి వేలుపై ఇంకు గుర్తు పెడతారన్న సందేహం మీకు రావొచ్చు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన న‌ల్ల‌గొండ‌-ఖ‌మ్మం-వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటువేసిన‌వారికి ఎడ‌మ‌చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తు వేశారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం దీని ప‌రిధిలోనే ఉండ‌టంతో అక్కడి పట్టభద్రుల ఓటర్లకు ఇంకా ఇంకు చెర‌గిపోక‌పోవ‌డంతో ఈ ఎన్నికల్లో ఎడ‌మ‌చేతి మ‌ధ్య‌వేలిపై ఇంకు గుర్తు వేయాలని ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు నిర్ణ‌యించింది.

ఇదిలా ఉంటే సాగ‌ర్ ఉపఎన్నిక‌ల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్‌ జరగనుండగా, మే 2న ఫ‌లితాలు వెలువ‌డనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ్మ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున రవి కుమార్ నాయక్ పోటీలో ఉన్నారు.