ఆప్ లో అంతర్గత విభేదాలు అపోహలేనా..?

Monday, March 2nd, 2015, 03:07:20 PM IST


ఆమ్ ఆద్మీ పార్టీలోని సీనియర్ నేతలమధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయని, ఈ విభేదాల కారణంగా ఆప్ ప్రభుత్వం ఇబ్బందులలో పడే అవకాశం ఉన్నట్టు వస్తున్నా వార్తల్లో నిజం లేదని పార్టీ సీనియర్ నేత యోగేందర్ యాదవ్ అన్నారు. విభేదాలు అనేవి ఆరోపణలే కాని, వాస్తవం కాదని అన్నారు. ఢిల్లీ ఎన్నికలలో ఆప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టే ఆప్ ను గెలిపించారని, రాజకీయాలు చేయడానికి తమకు సమయం లేదని.. ప్రజల అవసరాలు తీర్చడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం అని యోగేందర్ యాదవ్ అన్నారు. ప్రజలు తమ భుజష్కందాలపై పెద్ద బాధ్యతను ఉంచారని, ఆ భాద్యతను నెరవేర్చడమే తమ ముందున్న సవాలని ఆయన అన్నారు.