మహేశ్-త్రివిక్రమ్ కాంబోపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. !

Saturday, May 1st, 2021, 07:00:15 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబోకు సంబంధించి ఎప్పటినుంచో రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబోకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని ప్రకటించిన చిత్ర యూనిట్ అనుకున్నట్టుగానే ఆ అప్డేట్‌ను ఇచ్చేసింది.

గతంలో వీరిద్దరి కలయికలో 2005లో అతడు, 2010లో ఖలేజా చిత్రాలు రాగా దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబో కలవబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. హారికా అండ్ హాసిని బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా 2022 సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర రాజకీయాలకి ముడిపడి ఉందని, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని ఆయన కోసం కూడా త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని అందులో ఒక హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తుండగా కరోనా సేకండ్ వేవ్ నేపధ్యంలో షూటింగ్ కాస్త వాయిదా పడింది.