ఫ్రాన్స్ లో ఘోర విమాన ప్రమాదం

Tuesday, March 24th, 2015, 05:18:03 PM IST


దక్షిణ ఫ్రాన్సులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాగా జర్మన్ వింగ్స్ సంస్థకు చెందిన ఎయిర్ బస్-320 అనే విమానం బార్సిలోనా నుండి డస్సెల్ డార్ఫ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక డిగ్నే అనే ప్రాంతంలోని ఫ్రెంచ్ ఆల్ఫ్స్ దగ్గర ఈ విమానం క్రాష్ అయినట్లు అనుమానిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానంలో 142మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఇక ఈ విమానంలో ప్రయాణిస్తున్న 148మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై ఇంకా సమగ్ర సమాచారం అందాల్సి ఉంది.