పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ?

Monday, February 15th, 2021, 01:47:14 PM IST

బుల్లితెర షో లతో అభిమానులను ఎంతగానో అలరించిన యాంకర్, నటి అనసూయ అనంతరం తన ప్రతిభ తో నటీ గా ఎదిగింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో నాగ్ సరసన స్తెప్పులేసి వెండి తెర పై తళుక్కుమంది. అయితే క్షణం మరియు రంగస్థలం వంటి చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే నటి గా, యాంకర్ గా కెరీర్ ను కొనసాగుతూనే ఉన్న సమయం లో పొలిటికల్ ఎంట్రీ కోసం పలువురు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ఇప్పుడు అనసూయ చేరనున్నారా అనే వార్తలు వస్తున్నాయి.

అయితే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి అనసూయ భరద్వాజ్ సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు త్వరలో పొలిటికల్ ఎంట్రీ అని, అందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం.అయితే ఏ పార్టీ లో చేరతారు అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. అయితే మే నెలలో మంచి ముహూర్తాలు ఉండటం తో మే లో అధికారిక ప్రకటన చేసి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ సైతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో సత్తా చాటారు. మరి అనసూయ భరద్వాజ్ ఏ పార్టీ లో చేరతారు అనేది ఆసక్తి నెలకొంది.