బాలయ్య – బోయపాటి కాంబో లో వస్తున్న చిత్రానికి టైటిల్ అదేనా?

Friday, February 19th, 2021, 03:35:57 PM IST

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుంది అంటేనే అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే బాలయ్య ను వెండితెర పై మాస్ సన్నివేశాల్లో చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే బోయపాటి అంటే వేరే లెవెల్లో ఉంటుంది అని తెలిసిన విషయమే. అయితే బోయపాటి తో బాలయ్య బీ బీ 3 అంటూ ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలయిక లో వస్తున్న మూడవ చిత్రం కావడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే బీ బీ3 ఫస్ట్ రొర్ అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో ఇప్పటికే టాక్ ఆఫ్ ది సెన్సేషన్ అయింది. అయితే బాలయ్య ను పవర్ ఫుల్ పాత్రల్లో చూపించాలి అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. అందుకోసమే అందుకు అనుగుణంగా టైటిల్ ను కూడా అదే తరహాలో పెట్టేందుకు చిత్ర యూనిట్ ఆలోచనలో ఉంది. అయితే ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. త్వరలో దీని పై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.