సత్య నాదెళ్ళ ఒకే అన్నాడట!

Tuesday, May 19th, 2015, 09:47:01 AM IST


తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటిఅర్ రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఈ క్రమంలో ఇప్పటికే ఎందరో అమెరికా పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన కేటిఅర్, ఐటి దిగ్గజ కంపెనీ గూగుల్ తో భేటి అయ్యి ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయించేలా ఒప్పించడంలో సఫలీకృతం అయ్యారు. ఇక తాజాగా కేటిఅర్ మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగుతేజం సత్య నాదెళ్ళతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని సత్య నాదెళ్ళకు కేటిఅర్ విజ్ఞ్యప్తి చేశారు. కాగా దీనికి సత్య కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న కేటిఅర్ హైదరాబాద్ ఇన్వెస్ట్ మెంటుకు ఎంత అనుకూలంగా ఉంటుందో వివరిస్తూ పవర్ ఫుల్ ప్రజెంటేషన్స్ ద్వారా పారిశ్రామికవేత్తల నుండి స్పష్టమైన హామీలను సాధించడంతో సఫలీకృతులు అవుతున్నారు.