ఆప్ మాజీల కొత్త పార్టీ ‘స్వరాజ్ అభియాన్’!

Wednesday, April 15th, 2015, 03:22:35 PM IST


ఇటీవల ఆమ్ ఆద్మీ నుండి బహిష్కరణకు గురైన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు ‘స్వరాజ్ అభియాన్’ పేరిట కొత్త పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇకపై పార్టీకి అతీతంగా పనిచేస్తామని అందుకే స్వరాజ్ అభియాన్ పేరును సైతం ఖరారు చేశామని పేర్కొన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే ‘స్వరాజ్ అభియాన్’ కు మద్దతిస్తామని 75% మంది కార్యకర్తలు తెలిపారని ఈ నేతలు పేర్కొన్నారు.

వీరు ఇంకా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తాము పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే ‘స్వరాజ్ అభియాన్’ పార్టీ ద్వారా సమస్యలతో పోరాడి ప్రజల పక్షాన నిలుస్తామని యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు హామీ ఇచ్చారు. ఇక ఆప్ పార్టీలో ఉండే కార్యకర్తలే తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని వీరు పేర్కొన్నారు.