ఉపఎన్నికను సీరియస్ గా తీసుకున్న జగన్

Wednesday, October 8th, 2014, 01:40:24 PM IST


ఆళ్లగడ్డ ఉప పోరుకు రంగం సిద్దమైంది. ఉప ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కావడంతో అటు అధికార పార్టీతో పాటు.. ప్రతి పక్ష పార్టీ వైసీపీ సీటు దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. వీటితో పాటు కాంగ్రెస్ బరిలోకి దిగుతుండటంతో ఎన్నికలను ఆయా పార్టీలు సిరీయస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ భూమా కుటుంబం నుంచే ప్రతినిదిని బరిలోకి దించుతోంది. నవంబర్ 8న ఎన్నికలు జరుగుతుండటంతో అధికార పార్టీ కి సీటు దక్కకుండా చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

గత సాధారణ ఎన్నికల ముందు రోడ్డు ప్రమాదంలో అభ్యర్థి శోభానాగిరెడ్డి అకాల మరణం చెందారు. ఐతే ఆ తర్వాత వెల్లడించిన ఎన్నికల ఫలితాల్లో శోభానాగిరెడ్డే విజయం సాధించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరునెలల తర్వాత ఉప ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఈసీటుపై అటు అధికార పార్టీతో పాటు.. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కన్నేశాయి. ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఆళగడ్డలో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.

భూమానాగిరెడ్డి సీటు స్థానంలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సీటును తమ ఖాతాలో వేసుకొనేందుకు పావులు కదుపుతున్న వైసీపీ.. ఇందుకోసం భూమా రాజకీయ వారసురాలిని రంగంలో దించేందుకు సిద్దమైంది. ఇప్పటికే తన కూతురు భూమా అఖిల ప్రియ ఎన్నికల భరిలో నిలుస్తుందని భూమా నాగిరెడ్డి ప్రకటించారు. ఈ సీటును తమ ఖాతాలో వేసుకొని టిడిపికి షాక్ ఇస్తామని అంటున్నారు. అయితే ఈ మధ్య జరిగిన నందిగామ ఉప ఎన్నికల్లో వైసీపీ, టిడిపి అభ్యర్ది పై పోటి పెట్టలేదు. ఈ నేపథ్యంలో టిడిపి తమ అభ్యర్దిని రంగంలోకి దింపుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్దంగా ఉండాలని జగన్ సూచించారు. అలాగే కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్దని బరిలో నిలుపుతామని ప్రకటించిన తరుణంలో ఓటు బ్యాంక్ చిలకుండా గతంలో వచ్చిన మెజారిటి కంటే మంచి మెజారిటి సాధించాలని జగన్ భావిస్తున్నారు.

ఒక వేళ అధికార టిడిపి ఎన్నికల సాంప్రదాయాన్ని పాటిస్తే.. వైసీపీ భారీ మెజారిటి విజయం సాధించే అవకాశం ఉంది. అలా కాకుండా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్దులను నిలబెడితే మాత్రం ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నిక్లో గెలుపు అనేది వైసీపీకి పెద్ద సమస్య కానప్పటికి… సెంటిమెంట్ మీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి భారీ మెజారిటీ సాధించాలని భూమా నాగిరెడ్డి పట్టుదలగా ఉన్నారు. అంతేకాకుండా తన కూతురు అఖిల ప్రియను రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఆమెకు బలమైన రాజకీయ పునాధిని నిర్మించేందుకు భూమా నాగిరెడ్డి ఈ ఎన్నికను ఉపయోగించుకోనున్నారు. దీంతో నవంబర్ ఎనిమిది జరగబోయే ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా మారనుంది.