అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాడతామన్న జగన్..!

Tuesday, March 10th, 2015, 02:14:21 PM IST


రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యమని, అభివృద్ధి కోసం ఎవరితోనైనా ఎప్పటివరకైనా పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేడు అసెంబ్లీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి విషయంలో వెనుకబడిందని…కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవడంలో రాష్ట్రం విఫలమయిందని అన్నారు. రాష్ట్రం నిధులు ఇవ్వడంలేదని పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వనపుడు కేంద్రంతో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తుపెట్టుకున్నదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని జగన్ ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హొదా ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఇంతవరకు దాన్ని సాధించుకోలేకపోయిందని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోనియా తో పోరాటం చేసిందని, నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడితో పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజలకోసం, ప్రజల తరపున పోరాడేందుకు తమ పార్టీ సిద్దంగా ఉన్నట్టు జగన్ తెలిపారు.