టీమిండియాకు షాక్.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా దూరం..!

Saturday, February 27th, 2021, 05:34:08 PM IST

మొతెరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ నుంచి బుమ్రా వైదొలిగాడు. అయితే బుమ్రా విజ్ఞప్తికి బీసీసీఐ కూడా ఓకే చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల తనను నాలుగో టెస్టు మ్యాచ్ నుంచి మినహాయించాల్సిందిగా బుమ్రా కోరాడని దానికి ఒప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. దీంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చామని, అతడి స్థానంలో కొత్తగా ఎవరినీ తీసుకోబోమని తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో బుమ్రా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే రెండో మ్యాచ్‌కు బుమ్రా దూరం కాగా, మూడో మ్యాచ్ ఆడినా ఫాస్ట్ బౌలర్లకు పని లేకుండానే మ్యాచ్ ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఎక్కువ వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. అయితే మూడో మ్యాచ్ జరిగిన విధానం చూశాక మొతెరా పిచ్‌పై పలువురి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.