జయ ముందున్న అసలైన సవాళ్లు..!

Friday, May 15th, 2015, 11:25:30 AM IST


తమిళనాడు రాజకీయాలలో పెనుమార్పులు రాబోతున్నాయా అంటే అవుననే తెలుస్తున్నది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసు కేసు నుంచి జయలలితకు కర్ణాటక హైకోర్ట్ విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ కేసునుంచి విముక్తి లభించిన తరువాత, తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుందని అందరూ అనుకున్నారు. కాని, ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే, కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీతో పాటు, డిఎండికె పార్టీ అధినేత విజయ్ కాంత్ సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేసేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తున్నది. మరో పక్క కర్ణాటక ప్రభుత్వంపై కూడా వీరు ఒత్తిడి తెస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కూడా, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని చూస్తున్నది. అసలు ఈ కేసును మొదట ఫైల్ చేసిన బీజేపి నేత కుమారస్వామీ కూడా అప్పీల్ కు వెళ్ళే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు జయలలిత నివాసానికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. 16 లేక 17వ తేదీన అమ్మ జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుందనే వార్తలు వచ్చినప్పటికీ అవి ఊహాగానాలే అని తేలింది. ఇక, మరోసారి, 22న అన్నా డిఎంకె నేతలు అమ్మతో సమావేశం కానున్నారు. 22 ఉదయం 7 గంటలకు జయలలితతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తున్నది. అదే రోజున జయలలితను తన లీడర్ గా ఎన్నుకోనున్నారు. అనంతరం 23న అమ్మ జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందుతున్న తాజా సమాచారం బట్టి తెలుస్తున్నది.

అయితే, కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై కనుక సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేసి, అమ్మకు వ్యతిరేకంగా కనుక తీర్పు వస్తే, జయలలిత మరోసారి జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలాగో మరో ఆరు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ ముందుగానే ఎన్నికలకు వెళ్ళినా, జయ పార్టీనే విజయం సాధిస్తుందని తాజా నివేదికలు బట్టి తెలుస్తున్నది. జయలలిత ప్రవేశపెట్టిన పధకాలు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చిన సంగతి విదితమే. ఆ పదకాలే అమ్మను గెలిపిస్తాయని తమిళ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తమిళ రాజకీయాలలో ఏమి జరుగుతుందో తెలియాలంటే మరొకొన్ని రోజులు ఓపికగా వెయిట్ చేయాల్సిందే.