అమ్మకు బెయిల్ వస్తుందా..?

Monday, October 6th, 2014, 11:10:06 PM IST


అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ ను రేపు కర్ణాటక హైకోర్ట్ విచారించనున్నది. అయితే, గత వారం రోజులుగా జయలలిత జైలులోనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళడంతో.. ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.

కాగ, అన్నాడీఎంకె కార్యకర్తలు, అమ్మ అభిమానులు భారీగా పరప్పన అగ్రహార జైలు దగ్గర.. భారీగా చేరుకోవడంతో.. కర్ణాటక ప్రభుత్వం.. జైలు పరిసరాలలో 144వ సెక్షన్ ను విధిస్తున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా.. కర్ణాటక హైకోర్ట్ వద్దకూడా 144 సెక్షన్ ను విధిస్తున్నట్టు బెంగళూర్ సిటీ పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఈ 144 సెక్షన్ సోమవారం అర్ధరాత్రి నుంచి.. మంగళవారం అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుందని పోలీస్ కమీషనర్ తెలియజేశారు.

మరోవైపు.. జయలలితకు బెయిల్ వస్తే.. సరే.. లేకుంటే.. అమ్మను కర్ణాటక నుంచి తమిళనాడుకు షిఫ్ట్ చేసేందుకు కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.