జీవితకు బెయిల్ మంజూరు

Monday, November 24th, 2014, 07:12:42 PM IST


సిని నటి..తెలంగాణ బీజేపి అధికార ప్రతినిధి జీవితా రాజశేఖర్ కు బెయిల్ మంజూరు అయింది. అయితే… తనకు కోర్టు జైలు శిక్ష విధించలేదని… కేవలం జరిమానా మాత్రమే కట్టమన్నారని జీవిత స్పష్టం చేసింది. తమకు… చంద్రశేఖర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని.. పాత పత్రాలను… చెక్కులను చంద్రశేఖర్ ఫోర్జరీ చేసి… తప్పుడు కేసులు బనాయించారని ఆమె వాపోయింది. తనకు కోర్టు విధించిన 25లక్షల రూపాయల జరిమానాను కట్టినట్టు ఆమె తెలిపారు.

అయితే…చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్ట్ జీవితకు రెండేళ్ళ జైలు శిక్ష మరియు 25లక్షల రూపాయల జరిమానా విధించినట్టు ఈ మధ్యాహ్నం వార్తలు వెలువడ్డాయి. దీనిపై జీవిత వివరణ ఇచ్చారు. తనకు కోర్టు శిక్ష విధించారని వస్తున్నా వార్తలలో నిజం లేదని ఆమె తెలిపారు.