వైసీపీ ప్రభుత్వం అవినీతిమయం.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు..!

Tuesday, April 13th, 2021, 12:08:42 AM IST


వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ప్రచారం నిర్వహించిన జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని, నిందితులను ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

అయితే ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందని, ప్రభుత్వమే దగ్గరుండి మత మార్పిడులు చేయిస్తుందని, ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉందని నడ్డా ఆరోపించారు. అయితే ఏపీలో విపరీతమైన అవినీతి రాజ్యమేలుతుందని లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అన్నారు. సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని, ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిందని, 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయని నడ్డా అన్నారు.