ఎన్టీఆర్ ప్రజలలోకి వెళ్తున్నాడు.. ఎందుకో తెలుసా..?

Wednesday, February 17th, 2016, 12:41:35 PM IST


ఎన్టీఆర్ త్వరలోనే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా.. ఎన్టీఆర్ ప్రజలలోకి వస్తున్నాడు అంటే అందరం ఏమని అనుకుంటాం. రాజకీయాలలోకి వస్తారని, రావాలని చాలా మంది కోరుకుంటున్నారు కదా.. బహుశా అందుకోసమే ఎన్టీఆర్ ప్రజలలోకి వెళ్తున్నారని అనుకుంటాం. కాని, ఇక్కడ విషయం అదికాదట. మరెందుకు వెళ్తున్నట్టు.. అదే ఇప్పుడు తెలుసుకుందాం.

చెన్నై ఇటీవల వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటు కాలం వెళ్ళదీస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి మంచు లక్ష్మి మేము సైతం అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో సెలెబ్రిటిలను ఇన్వాల్వ్ చేస్తున్నది. ఇప్పటికే మంచు లక్ష్మి మేముసైతం కార్యక్రమంలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మడం, ఖమ్మంలో అఖిల్ ఆటో నడపడం, హీరో రానా కూలిగా మారి బస్తాలు మోయడం వంటివి చేశారు.
ఇక, మంచు లక్ష్మి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసినపుడు ఈ విషయం చర్చకు వచ్చింది. మంచు లక్ష్మి మేముసైతం కార్యక్రమంలో తాను సైతం పాల్గొంటానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట. మరి ఎప్పుడు ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంతాడో చూడాలి.