కుమారుడి పుట్టినరోజుకు భారీ ప్లాన్ వేసిన ‘జూ.ఎన్టీఆర్’..!

Friday, July 15th, 2016, 11:36:47 AM IST


‘యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్’ తన కుమారుడు ‘అభయ్ రామ్’ బర్త్ డే వేడుకల కోసం భారీ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మునుపు ఎన్టీఆర్ తన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకల్ని లండన్ లో జరిపిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి వేడుకలను అభిమానుల మధ్య చేయాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ నెల 22న అభయ్ పుట్టిన రోజునాడే తన సినిమా జనతా గ్యారేజ్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ వార్త తెలియగానే అభిమానులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. అలాగే అభయ్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా భారీగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్య అభిమానులతో బాగా సన్నిహితంగా మెలుగుతున్న జూనియర్ తన కుమారుడి పుట్టినరోజుతో వాళ్లకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.