మరో కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న కొరటాల శివ

Tuesday, February 23rd, 2016, 05:40:29 PM IST


టాలీవుడ్ లో బహుమతుల సాంప్రదాయం చాలా ఖరీదుగా నడుస్తోంది. తరచూ హీరోలు, ప్రోడ్యూజర్లు తమకు మంచి హిట్లిచ్చిన దర్శకులకి ఊహకందని ఖరీదైన బహుమతులిస్తున్నారు. ఇలాంటి బహుమతులందుకుంటున్న దర్శకుల్లో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ ముందున్నారు. మిర్చి, శ్రీమంతుడు వంటి వరుస హిట్లతో జోరుమీదున్న ఈ డైరెక్టర్ తాజాగా తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం హీరో జూనియర్ ఎన్టీఆర్ నుండి దాదాపు రూ.20 లక్షల విలువైన రిస్టు వాచీని బహుమతిగా అందుకున్నట్లు సమాచారం.

గతంలో కూడా కొరటాల శివకు హీరో మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరైన శ్రీమంతుడు సినిమాని అందించినందుకుగాను లక్షలు విలువ చేసే ఖరీదైన ఆడీ ఏ6 కారును బహుమతిగా అందించారు. అలాగే ఇంతకుముందు నిర్మాతైన బండ్ల గణేష్ దర్శకుడు పూరీకి 44 లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన సిగరెట్ లైటర్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని రోజులు పోతే దర్శకులు వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్ కన్నా కూడా ఖరీదైన బహుమతులను హీరోల నుండి అందుకునే సందర్బాలు రావచ్చేమో.