ఆ నిర్ణయం సరైనదన్న కమల్ !

Tuesday, June 30th, 2015, 12:55:48 PM IST


తమిళనాడు ప్రభుత్వం నేటి నుండి వాహన చోదకులు హెల్మెట్ ధరించాలన్న నిబంధనను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ మేరకు కమల్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అది తమ స్వీయ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు. అలాగే ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సురక్షితంగా డ్రైవింగ్ చెయ్యాలని కమల్ సూచించారు. ఇక సినిమాలలో నటీనటులు హెల్మెట్ ధరించకపోవడంపై స్పందిస్తూ సినిమాల్లో, సర్కస్ లో చేసే స్టంట్స్ ను బయట చెయ్యలేం కదా.. అంటూ కమల్ తన సందేశాన్ని ఒక వీడియో ద్వారా తెలిపారు.