భూవివాదంలో యాంకర్ సుమ కుటుంబం!

Wednesday, January 28th, 2015, 01:24:29 PM IST


ప్రముఖ నటుడు, టీవీ యాంకర్ సుమ మామగారైన దేవదాసు కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. దీనితో దేవదాసు కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల ఇరువురు హయత్ నగర్ పోలీసులను బుధవారం ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని దేవదాసు కనకాలకు చెందిన స్థలంలో గత రాత్రి దుండగులు ప్రవేశించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కాగా ఈ విషయాన్ని స్థానికులు దేవదాసుకు సమాచారం అందించడంతో వెంటనే కనకాల కుటుంబీకులు స్థలం వద్దకు చేరుకొని దుండగులను వెళ్ళిపొమ్మని ఆదేశించారు. అందుకు కబ్జాదారులు ససేమిరా అనడంతో దేవదాసు కనకాల, రాజీవ్ కనకాల ఇరువురు పోలీసులను ఆశ్రయించారు.