అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్ళడంపై డీఎంకె అధినేత కరుణానిధి స్పందించారు. జయ జైలుకు వెళ్ళిన 12 రోజుల అనంతరం కరుణానిధి ఈ రోజు డీఎంకె పార్టీ మీటింగ్ లో జయలలిత గురించి మాట్లాడారు. జయలలిత తన వలలో తానే చిక్కుకున్నదని.. అన్నారు. తనను ఎవరు ప్రశ్నించలేరనే పరిస్థితులను రాష్ట్రంలో కల్పించిన జయలలిత ఇప్పుడు తన పతనం తాలుగు పాఠాలను జైల్లో చదువుకుంటున్నారని కరుణానిధి అన్నారు. ఎదురులేదనుకున్న జయ జైలుపాలవ్వడానికి ఎవరూ కారణం కాదని.. ఆమెకు ఆమె కారణమని కరుణానిధి తెలిపారు.
ఎట్టకేలను కరుణానిధి స్పందన
Thursday, October 9th, 2014, 01:07:26 PM IST