మామను బుట్టలో వేసింది.. ప్రేమ కోసమేనా?

Monday, August 24th, 2015, 04:25:37 PM IST


బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్, స్టార్ హీరో రణబీర్ కపూర్ లు కొద్ది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ చిత్రంలో కలిసి నటించినప్పటి నుండి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా పత్రికలు ప్రచారం చేసినప్పటికీ, అలాంటిది ఏమీ లేదంటూ వీరు చెప్పుకొస్తున్నారు. ఇక హాలీడే ఫారిన్ ట్రిప్ లో ఈ జంట మీడియా చేతికి అడ్డంగా దొరికినా, తమ మధ్య ఉన్న బంధాన్ని కత్రినా, రణబీర్ లు బయటపెట్టలేదు. కాగా ఇంతకాలం ప్రేమపక్షులుగా తిరిగిన వీరిద్దరి వివాహానికి రణబీర్ ఇంట్లో అడ్డంకులు ఎదురవుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రణబీర్ తండ్రి, ప్రముఖ నటుడు రిషి కపూర్ పై కత్రినా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి.

ఇక రిషి కపూర్ గురించి కత్రినా మాట్లాడుతూ ఆయన ఒక లివింగ్ లెజెండ్ అంటూ ఆకాశానికెత్తింది. అలాగే రిషితో కలిసి తాను ‘నమస్తే లండన్’ అన్న చిత్రంలో నటించానని, ఆయన ఒక అద్భుతం, అసాధారణ వ్యక్తని కత్రినా ప్రశంశలు కురిపించింది. ఇక ఆయనను చూసినప్పుడు తాను సంతోషంగా ఫీల్ అయ్యానని ఈ బాలీవుడ్ బ్యూటీ పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా ఈ వ్యవహారం తెలిసిన వారు మాత్రం కత్రినా కాబోయే మామగారిని బుట్టలో వేసుకునే ప్రయత్నంలోనే ఇన్ని ప్రశంశలు కురిపిస్తోందని గుసగుసలాడుతున్నారు.