కేసీఆర్ 4రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు.. ఎందుకు..?

Thursday, February 4th, 2016, 04:39:33 PM IST


ఎప్పుడూ హైదరాబాద్ లేక ఇతర తెలంగాణా జిల్లాల్లో ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉండే సీఎం కేసీఆర్ గత నాలుగు రోజులుగా మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. కనీసం ముఖ్యమైన గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నా.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా కూడా ఆయన నగరానికి రాలేదు. కానీ ఎప్పటికప్పుడు గ్రేటర్ ఎన్నికల పరిస్థితులను అనుచరుల ద్వారా సమీక్షిస్తూనే ఉన్నారు.

పైగా నారాయణఖేడ్ లో జరగాల్సిన ఉప ఎన్నికల గురించి మేనల్లుడు హరీష్ రావుకు ఫోవ్ చేసి మరీ విచారిస్తున్నారట. అసలు నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ కు రావాల్సి ఉండగా ఎందుకో ప్రయాణం క్యాన్సిలై ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారట. ఒక రాష్ట్ర సీఎం ఇన్ని రోజులు ఒకే ప్రదేశానికి పరితమవటం పలు అనుమానాలకు తావిస్తోంది.