రాజీనామా చేసిన రోజే ప్రమాణస్వీకారం

Tuesday, February 10th, 2015, 04:00:32 PM IST


ఢిల్లీ పీఠాన్ని సామాన్యుడి పార్టీ కైవసం చేసుకున్నది. గతంలో ఆప్ కేవలం 28 స్థానాలకే అయిన ఆప్, ఇప్పుడు తిరుగులేని విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. అంతకు మించి స్థానాలలో విజయం సాధించింది సామాన్యుడి పార్టీ. 2013లో 28స్థానాలలో విజయం సాధించి, కాంగ్రేస్ పార్టీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ పార్టీ, కేవలం 49రోజుల పరిపాలన అనంతరం రాజీనామా చేయడంతో తిరిగి ఎన్నికలలు నివహించవలసిన అవసరం ఏర్పడింది. ఢిల్లీ 70 నియోజక వర్గాలకు ఫిబ్రవరి 7న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆప్ పార్టీ అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, బీజేపి తమ గెలుపుపై ధీమాను వ్యక్తంచేసినప్పటికీ, అసలు కనీసం రెండక్కెల మార్కును కూడా దాలేకపోయింది. కేవలం మూడు స్థానాలతోనే సరిపెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతాను సైతంతెరవలేదు.

ఇక, కేజ్రీవాల్ గతంలో రాజీనామా చేసిన ఫిబ్రవరి 14వ తేదీనే తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశరాజధానిలోని రామ్ లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఐదు సంవత్సరాల పాటు సమర్ధవంతమైన పాలన అందిస్తామని కేజ్రీవాల్ విజయం సాధించిన అనంతరం అన్నారు. అవినీతిని అంతమొందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అన్నిహామీలను అమలుపరుస్తామని కేజ్రీవాల్ గెలుపొందిన అనంతరం ప్రజలనుద్దేశించి తెలియజేశారు.