లాక్ డౌన్ ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం

Thursday, May 6th, 2021, 01:23:50 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 8 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక ప్రకటన చేశారు. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివిటి రేటు తగ్గడం లేదు అని వ్యాఖ్యానించారు. కోవిడ్ కట్టడికి లాక్ డౌన్ తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేరళ లో నిన్న ఒక్క రోజే 42 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోనే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న జాబితాలో 10 జిల్లాల తో కేరళ రాష్ట్రం తొలి స్థానం లో ఉన్నది.అయితే దేశం లో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో కేరళ రెండవ స్థానం లో ఉన్నది. అయితే లాక్ డౌన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.