ఖమ్మంకి కొత్తకళ

Sunday, December 14th, 2014, 11:52:02 AM IST


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎట్టకేలకు ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లభించబోతున్నది. టిఆర్ఎస్ పార్టీకి నిన్నా మొన్నటి వరకు… అంటే.. తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లానుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరక ముందువరకు ఆ జిల్లాకు కాబినెట్ లో ఎటువంటి పదవి దక్కలేదు. ఇక తుమ్మల టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ… చాలా కాలం వేచి ఉన్నారు. తెలంగాణ కాబినెట్ విస్తరణ జరుగుతుందని.. విస్తరణలో భాగంగా ఖమ్మం నేతలకు పదవులు వస్తాయని భావించారు. విస్తరణ ఎప్పుడో ఉంటునదని అనుకున్నప్పటికీ నిన్నటివరకు విస్తరణకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారయింది. డిసెంబర్ 16న మంత్రి వర్గ విస్తరణ జరగబోతున్నది. ఇందులో ఖమ్మం జిల్లానుంచి తుమ్మల నాగేశ్వర రావుకు, అలాగే మరోనేత జలగం వెంకట్రావుకు కెసిఆర్ కేబినెట్లో పదవులు దక్కబోతున్నాయి. అయితే.. ఎవరేవరికీ ఏఏ పదవులు దక్కబోతున్నాయో తెలియాలంటే…16వ తేదీవరకు ఆగాల్సిందే.