తెలంగాణాలో మళ్ళీ మొదలైన ఎన్నికల సందడి

Monday, February 22nd, 2016, 03:42:04 PM IST


తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల వేడి ఇంకా తగ్గకముందే.. మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు మహబూబ్ నగర్ అచ్చం పేట నగర పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రిబ్రవరి 22న మొదలై మార్చి 9న ముగుయనుంది.

ఇప్పటికే ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా 24న నామినేషన్లను స్వీకరిస్తారు. 25 న వాటిని పరిశీలించి 26న ఉపసంహరణకు అవకాశమిస్తారు. తరువాత మార్చి 6 న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అనంతరం మార్చి 9న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి పూర్తవుతాయి.