నిరుద్యోగులకు మాయ’లేడి’ టోకరా

Wednesday, March 4th, 2015, 11:39:53 AM IST


నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళా అమాయకులైన యువకుల నుంచి దండిగా డబ్బు వసూలు చేసి, టోకరా ఇచ్చింది. వివరాలలోకి వెళ్తే…

హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ అనే మహిళా ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ ఫ్రెండ్స్ క్లబ్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించింది. నిరుద్యోగులైన యువకులు మేల్ ఎస్కార్ట్ ఉద్యోగం ఇప్పిస్తామని, అంతేకాకుండా, వారికి మంచి కమిషన్ కూడా ఇప్పిస్తామని, ఉద్యోగం కావలసిన వారు సదరు వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. ఉద్యోగం కావలసిన వారు ముందుగా రిజిస్టేషన్ కోసం 7 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని సూచించింది. నిజమే అని భావించిన నిరుద్యోగ యువకులు, ఆమె చెప్పినట్టుగానే డబ్బులను సూచించిన బ్యాంక్ ఎకౌంటులలో డిపాజిట్ చేశారు. అయితే, డిపాజిట్ చేసిన తరువాత, సదరు మాయలేడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఎకౌంటు లో డబ్బు డిపాజిట్ చేసిన వారు ఖంగు తిన్నారు. వెంటనే.. పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ మాయలేడి, ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ ఫ్రెండ్స్ క్లబ్ ను గత నాలుగు సంవత్సరాలుగా నడుపుతున్నట్టు తేలింది. ఆ మాయలేడిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. ఫర్హీన్ నుంచి మూడు లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్, ఏటిఎం కార్డును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.