మరోసారి నిర్భంధంలోకి లఖ్వీ..!

Tuesday, December 30th, 2014, 01:37:58 PM IST


26/11 పేలుళ్ళ ప్రధాన సూత్రధారి లఖ్వీని పాక్ ప్రభుత్వం మరోసారి అదుపులోకి తీసుకున్నది. ఈనెల 18న ఇస్లామాబాద్ లోని యాంటి టెర్రరిస్ట్ కోర్ట్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేసింది. కాగ, పాక్ పై ఒత్తిడులు పెరగడంతో ఎంపిఓ పేరుతో అదుపులోకి తీసుకున్నది. అయితే, తనకు బెయిల్ మంజూరు చేస్తే, ప్రభుత్వం ఎంపీఓ పేరుతో అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ, ఇస్లామాబాద్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. లఖ్వీ పిటిషన్ ను విచారించిన కోర్ట్, ఎంపీఓ ను తిరష్కరించినది. దీంతో లఖ్వీ విడుదలకు మార్గం సిద్దమయింది.

ఈ ఘటనతో భారత్ నివ్వెరపోయింది. వెంటనే… అప్రమత్తమై, పాక్ హైకమీషనర్ కు భారత విదేశాంగ శాఖ సమన్లు దాఖలు చేసింది. దీంతోపాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచింది. ఇదీలా ఉంటే, లఖ్వీని మరోకేసు మీద ప్రభుత్వం మరోసారి నిర్భందంలోకి తీసుకున్నది. ఆ కేసులో భాగంగా లఖ్వీని ఈ రోజు కోర్ట్ లో హాజరుపరచనున్నారు.