లోకేశ్‌ని చూసి అందరు నవ్వుకుంటున్నారు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

Monday, April 5th, 2021, 10:32:17 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ మహిళా నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆమె తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని అన్నారు. నారా లోకేశ్ ప్రచారంలో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదని, టీడీపీనీ అభ్యర్థిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధర తగ్గిస్తామని చెబుతున్నాడని, కనీస అవగాహన కూడా లేకుండా నారా లోకేశ్ మాట్లాడుతున్నాడని అతడిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రతుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన బాగు చెయ్యలేరని, చంద్రబాబు ఆ పార్టీనీ ఆ స్థాయికి భూ స్థాపితం చేసాడని అన్నారు.

ఇకపోతే కనీస ఓటు బ్యాంకు లేని బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందులపై చేసిన వ్యాఖ్యలు నిజంగా దారుణమని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన ఊరు పులివెందుల అని అలాంటి ఊరిపై దుర్భాషలాడడం పవన్ కళ్యాణ్ దిగజారుడుతనానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతీ అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి ఏనాడు నోరు జార లేదని అలాంటి వ్యక్తికి తమ్ముడిగా ఉన్న నీకు ఎందుకు నోటి దురద అని అన్నారు. మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.