టాలీవుడ్ సీనియర్ నటుడు రంగనాథ్ విషాదకరంగా మృతి చెందారు. 66 ఏళ్ళ వయసులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1949 మద్రాసులో జన్మించిన ఆయన 1969 లో బుద్దిమంతులు అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. అలాగే 1973లో వచ్చిన చందన సినిమాలో పూర్తి స్థాయి హీరోగా నటిచారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన జీవితంలో మాత్రం నటించలేక మరణించారు. 2009లో భార్య చైతన్య చనిపోయినప్పటి నుండి ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.
పైగా ఇద్దరు కూతుళ్ళు, కొడుకూ కూడా తనకు దూరంగా నివసిస్తుండటంతో ఆయన మరింత కృంగిపోయారు. చివరగా ఆయన చనిపోతూ స్నేహితుడు దేవదాసుకు ‘గుడ్ బై సర్’ అని మెసేజ్ పెట్టి, ఇంట్లోని గోడలపై ‘ డెస్టినీ’ అని.. ‘నా బీరువాలో పనిమనిషి మీనాక్షి పేరుమీద ఆంద్రా బ్యాంక్ లో ఉన్న బాండ్స్ ను ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్’ అని తన మనసులోని చివరి మాటలను రాశారు.