తెలివైన పిల్లలు కావాలంటే… ఆ వయసులోనే కనాలట..!!

Monday, December 21st, 2015, 10:01:42 AM IST


మనవాళ్ళు 18 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేసుకోవాలని.. అలా పెళ్లి చేసుకుంటే.. వయసు ఉండగానే పిల్లలు పుడితే.. మనం పెద్ద వల్లయ్యె సరికి వారు పెద్దోళ్ళు అవుతారు అని ఆలోచిస్తాం. అయితే, పుట్టే పిల్లలు తెలివైన వాళ్ళుగా ఉండాలి అంటే.. 30 సంవత్సరాలలోపు పిల్లలు కనకూడదని.. 30 నుంచి 39 సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలను కంటే.. ఆ పిల్లలు తెలివైన వాళ్ళుగా ఎదుగుతారని ఇటీవలే పరిశోధనలో తేలింది. ఇకపోతే, నలభై సంవత్సరాల వయసు దాటిన తరువాత పిల్లలను కన్నా వారు అంత తెలివైన వారిలా ఉండరని ఇటీవల పరిశోధనలో తేలింది.

లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ 18 వేల మంది బాలలపై ఈ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న అలిస్ గోయిసిస్ అనేక విషయాలను వెలువరించారు. మహిళలకు 30 సంవత్సరాల వయసు వచ్చే సరికి అన్ని రకాలుగా మెచ్యూర్ అవుతారని.. సంపాదన విషయంలో కాని, పిల్లల విషయంలో కాని వారి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, ఇక, ప్రసవం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో కాని వారు శ్రద్ద వహిస్తారని అన్నారు. ఇకపోతే, పిల్లలకు తల్లిపాలనే అందిస్తారని.. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా.. తెలివిగా కూడా ఉంటారని ఈ పరిశోధనలో తేలింది.