జగన్ ఢిల్లీ పర్యటనలపై సరికొత్త అనుమానాలు.. పార్లమెంట్ సాక్షిగా నిజాలు..!

Monday, March 8th, 2021, 05:12:29 PM IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలపై సరికొత్త అనుమానాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని వైసీపీ చెబుతుంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ తనపై ఉన్న కేసుల విషయాలకు సంబంధించే ఢిల్లీ వెళ్తున్నారు తప్పా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు కాదని ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తుంది.
అయితే ఈ విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలే నిజమని అనిపిస్తున్నాయి. ఎందుకంటే జనవరి 19న అమిత్‌ షాను కలిసిన జగన్ పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని కోరినట్టు ప్రభుత్వం పత్రిక ప్రటకన విడుదల చేసింది. అయితే ఇవాళ పార్లమెంట్‌లో ఇదే అంశంపై వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని, సీఎం జగన్ ఇదివరకే అమిత్‌ షాను కలిసి దీనిపై మెమొరాండం కూడా అందించారని అన్నారు. అయితే దీనిపై జలశక్తి సహాయ మంత్రి రతన్ లాల్ మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన ఏదీ తమ దృష్టికి రాలేదని, మెమొరాండం కూడా జగన్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో అసలు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కలిసి ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలే నిజమా అన్న ప్రశ్నలు మళ్ళీ తలెత్తుతున్నాయి.