తొలి సెంచరీ కొట్టిన లోకేష్ రాహుల్

Thursday, January 8th, 2015, 10:06:43 AM IST


ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. కాగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు కళ్ళ ముందు పెవిలియన్ దారి పట్టినప్పటికీ కొత్త కుర్రాడు లోకేష్ రాహుల్ తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక సెలెక్టర్లు తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిరూపించుకున్న ఈ కర్ణాటక కుర్రాడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ ద్వారా టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టి తన సత్తా చాటుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే వికెట్లు పడకుండా చూసుకుంటూ లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీలు నిలకడగా ఆటను కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాహుల్ సెంచరీ పూర్తి చెయ్యగా భారత్ రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.