“ఆర్ఆర్ఆర్” తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్

Wednesday, February 17th, 2021, 05:42:33 PM IST

RRR_movie_update

రౌద్రం రణం రుధిరం చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన మొదలు, ఇప్పటి వరకూ సినిమా పై ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థ లైకా సొంతం చేసుకుంది. అయితే ఇదే విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని రికార్డ్ ధరలో కొన్నట్లు తెలుస్తోంది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ నటిస్తున్నారు. ఈ చిత్రం లో వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయిక లు గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్ లతో పాటుగా, సముద్ర ఖని సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా గా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.