వెండితెరపై తన పేరును కొత్తగా చుస్తానంటున్న బాలీవుడ్ తార!

Tuesday, December 2nd, 2014, 12:33:31 PM IST

బాలీవుడ్ వెండితెరపై దశాబ్దానికి పైగా వెలుగులీనిన అందాల నటి మాధురీ దీక్షిత్. ప్రస్తుతం మరోసారి తనపేరును సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఉబలాటపడుతోంది. హీరోయిన్ గా మాత్రం కాదండోయ్… నిర్మాతగానంట. అవునుమరి.. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో యమబిజీగా వుందట. హీరోయిన్‌గా ఇన్నింగ్స్ ముగించిన తర్వాత ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సినీ నిర్మాణంపై దృష్టి సారించింది. త్వరలోనే నిర్మాతగా మీ ముందుకు వస్తానంటున్న మాధురీ ఎలాంటి సినిమాలు నిర్మిస్తుందనే ప్రశ్నకు మాత్రం సమాధానమివ్వకుండా వెయిట్ & సీ అని బదులిచ్చింది.