అనగనగా దావూద్..ఇండియాలో అతనికో కొడుకు

Friday, November 20th, 2015, 03:39:44 PM IST


ఛోటా రాజన్ అరెస్టయినప్పటి నుండి అండర్ వరల్డ్ డాన్ ‘దావూద్ ఇబ్రహీం’ పై, అతని ‘డీ గ్యాంగ్’ పై రోజుకో వదంతి వినిపిస్తోంది. కొందరు పోలీస్ పెద్దలు కూడా మెల్లగా ఒక్కో విషయాన్ని బయటపెడుతున్నారు. తాజాగా ఢిల్లీ నగర పోలీస్ కమీషనర్, గతంలో సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన నీరజ్ కుమార్ తను రాసిన పుస్తకం ‘ డబుల్ డీ ఫర్ డాన్’ అనే పుస్తకంలో కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకం ఈనెల 21న విడుదల కానుంది.

నీరజ్ కుమార్ కధనం ప్రకారం ‘తాను వివిధ సందర్బాలలో మూడుసార్లు దావూద్ తో మాట్లాడానని తెలిపారు. ఓ 90వ దశకంలో దావూద్ బాలీవుడ్ ను కనుసన్నలతో ఎలాడని, ఆ సమయంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటితో ప్రేమాయణం సాగించి ఆతరువాత ఆమెను పెళ్లి చేసుకొని దుబాయ్ లోనో, పాకిస్తాన్ లోనో స్థిరపడ్డాడని, హీరోయిన్ మాత్రం ముంబైలోనో, దుబాయ్ లోనో ఉందని మాత్రమే తెలిపారు. కానీ వీరిద్దరికీ పుట్టిన కుమారుడు మాత్రం బెంగుళూరులోనే సదరు హీరోయిన్ సోదరి వద్ద పెరుగుతున్నాడని’ తెలుస్తోంది.

ఇవన్నీ వింటుంటే ఒకవేళ నిజంగానే దావూద్ కి కొడుకుంటే..అతను బెంగుళూరులోనే పెరుగుతుంటే ఇప్పుడతని వయసెంత, చదువుకుంటున్నాడా లేక ఏదైనా బిజినెస్ చేస్తున్నాడా..లేకపోతే ఇవేవీ కాక తండ్రిలాగే మాఫియాను నడుపుతున్నాడా..? అన్న అనుమానాలు వస్తున్నాయి.