మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా…అసలు కారణం ఇదేనా?

Monday, April 5th, 2021, 03:48:29 PM IST

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేష్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం తో హోం మంత్రి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే వంద కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం తో తను రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖ ను సీఎం ఉద్ధవ్ కి పంపారు అనిల్ కుమార్. అయితే సీబీఐ విచారణకి బాంబే హైకోర్టు ఆదేశించడం తో హోం మంత్రి అనిల్ పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. అయితే పదిహేను రోజుల్లో విచారణ చేపట్టాలి అని సీబీఐ కి హైకోర్ట్ ఆదేశాలను జారీ చేసింది. అయితే నెలకు వంద కోట్ల రూపాయలను టార్గెట్ పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి అనిల్ అవినీతి పై విచారణా జరపాలని ముంబై మాజీ సీపీ హైకోర్ట్ ను ఆశ్రయించడం తో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.