భారీ కుంభకోణానికి పాల్పడిన మహిళా మంత్రి?

Wednesday, June 24th, 2015, 05:57:33 PM IST


మహారాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే దాదాపు 200వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కాగా గత ఫిబ్రవరి 13న పాఠశాలల పరికరాల కోసం, పుస్తకాల కోసం ఆమె మొత్తం 24 కాంట్రాక్టులను చేపట్టారని, ఆ సమయంలో కనీస పద్దతులను పాటించకుండా కుంభకోణానికి తెరలేపారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక విషయానికి సంబంధించి ఆమె కనీస ప్రమాణాలు పాటించలేదని, వీటికి చెందిన పూర్తి ఆధారాలు, దస్తావేజులతో సహా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇక గిరిజన విద్యార్ధులను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత చూడాల్సిన ఒక మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏ మాత్రం గర్హనీయం కాదని పంకజ ముండేపై కాంగ్రెస్ పార్టీ నిప్పుల వర్షం కురిపించింది. కాగా పంకజ ముండే గతేడాది దుర్మరణం పాలైన ప్రముఖ భాజపా నేత గోపీనాధ్ ముండే కుమార్తె అన్న సంగతి తెలిసిందే.