ప్రిన్స్ మహేష్ బాబు కొత్త అవతారం..!

Wednesday, January 20th, 2016, 10:13:09 AM IST


చాలా కాలం తరువాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రజలకు సుపరిచితమైన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. అందరికీ తెలిసిన పేరు శ్రీశ్రీ. ఆయన కవి మాత్రమే కాదు..తన కవితలతో ప్రజలలో చైతన్యం తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. శ్రీశ్రీ పేరుతోనే సినిమా తీస్తున్నారు. ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇకపోతే, ఈ సినిమాలో శ్రీశ్రీ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్నారు. ఇక దీనిని పక్కన పెడితే.. ఈ సినిమాకు కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. తండ్రి సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఐడియా మహేష్ బాబుకే వచ్చిందని.. మహేష్ బాబు ఈ ఐడియాను శ్రీశ్రీ ప్రొడ్యూసర్స్ కి చెప్పారని.. చిత్ర యూనిట్ చెప్తున్నది. ఇక, ఇందులో మహేష్ బాబు నటిస్తారు అనే విషయాన్ని మాత్రం యూనిట్ కొట్టేసింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నారని, శ్రీశ్రీలో నటించడం లేదని చెప్పుకొచ్చారు.