మహేష్ బాబు బ్రహ్మోత్సవం కథ ఇదేనా..?

Sunday, May 1st, 2016, 04:27:20 PM IST


మహేష్ బాబు హీరోగా కాజల్, సమంత, ప్రణతి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఈనెల 7 వ తేదీన విడుదల కాబోతున్నది. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే బ్రహ్మోత్సవం సినిమాలోని బైక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, బ్రహ్మోత్సవం సినిమా కథ గురించి కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు తండ్రి అనుకోకుండా దురదృష్టవశాత్తు మరణిస్తాడు. కుటుంబం కోరిక ప్రకారం మహేష్ బాబు తండ్రి అస్తికలను కాశిలోని గంగానదిలో కలిపేందుకు ట్రైన్ లో బయలుదేరుతాడు. అలా వెళ్ళే సమయంలో ట్రైన్ లో హీరోయిన్ పరిచయం అవుతుంది. మహేష్ ను చూడగానే ఫ్లాట్ అవుతుంది. అతనిని ప్రేమిస్తున్నాని చెప్తుంది. ఆ అమ్మాయే సమాంత. అయితే, తాను ఇదివరకే కాజల్ ని ప్రేమించానని, ఆమె ఓ ఎన్నారై అని, తన తండ్రి తండ్రి స్నేహితుడి కూతురని చెప్తాడు. తననే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు మహేష్. కాశీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక మహేష్ బాబుకు సమంత గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.

ఆ సమయంలోనే మహేష్ కుటుంబం ట్విస్ట్ ఇస్తుంది. మహేష్ ఇంట్లో ఉన్న మహేష్ మరదలు ప్రణితను పెళ్లి చేసుకోవాలని, అది చనిపోయిన తండ్రి చివరి కోరిక అని మహేష్ కుటుంబం చెప్తుంది. కుటుంబానికి, వారి మాటను గౌరవించే మహేష్ ప్రణితను పెళ్లి చేసుకున్నాడా, ప్రేమించిన సమంతను పెళ్లి చేసుకున్నాడా లేదంటే.. సమంతకు చెప్పిన కథలోని కాజల్ ను పెళ్లి చేసుకున్నాడా అన్నది మిగతా కథ. అయితే, ఇది బ్రహ్మోత్సవం కథేనా లేక కేవలం పుకారేనా అన్నది త్వరలోనే తేలిపోతుంది.