బ్రహ్మోత్సవం ఆగిపోలేదు.. ఊటి వెళ్తుందట..!

Monday, November 23rd, 2015, 11:05:34 AM IST


ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవంపై ఇటీవల కాలంలో అనేక పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం వన్ లైనర్ నచ్చిందని.. కాని, శ్రీకాంత్ స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే సినిమా వాయిదా పడుతూ వస్తున్నదని వార్తలు వచ్చాయి. రెండో రోజుల క్రితం ఏకంగా బ్రహ్మోత్సవం ఆగిపోయిందనే కధనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక, ఇదిలా ఉంటే, ఈరోజు బ్రహ్మోత్సవం గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. బ్రహ్మోత్సవం ఆగిపోలేదట. డిసెంబర్ రెండో వారం నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 9 నుంచి నెలాఖరు వరకు ఊటిలోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపుకోబోతున్నదట.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. పీవిపీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవం విడుదల అవుతుందని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.